8 August, 2026 | 11:26 PM

‘చేయూత’ పింఛన్లకు దరఖాస్తులు చేసుకోండి

08-08-2026 02:02 PM

ఎంపీడీవో విజయ్ కుమార్

జడ్చర్ల : రాష్ట్రంలో ‘చేయూత’ పథకం కింద కొత్త పింఛన్ల మంజూరుకు ఈ నెల 8 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని జడ్చర్ల మండల ఎంపీడీవో విజయ్ కుమార్ తెలిపారు. ఒంటరి మహిళలు, వితంతువులు, గీత, చేనేత కార్మికులు, వికలాంగులు, దయాలసిస్ బాధితులు, థాలసేమియా, సికిల్ సెల్, హిమోఫీలియా బాధితులకు పింఛన్లు మంజూరు చేస్తామన్నారు. గ్రామాల్లో ఏటా 1.50 లక్షలు, పట్టణాల్లో 2 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు అర్హులని, 3 ఎకరాల మెట్ట, 7.5 ఎకరాల మాగాణి లోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులకు, పట్టణాల్లో బిల్ కలెక్టర్లకు దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు.