calender_icon.png 23 February, 2026 | 3:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

38 ఎస్పీఓ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

23-02-2026 02:08:05 AM

  1. తాత్కాలిక ప్రాతిపదికన నియామకాలు
  2. మార్చి 5 వరకు గడువు

హైదరాబాద్,సిటీ బ్యూరో ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): హైదరాబా ద్ సిటీ పోలీస్ విభాగంలో ఖాళీగా ఉన్న 138 ప్రత్యేక పోలీస్ అధికారుల(ఎస్పీఓ) పోస్టుల భర్తీకి దరఖా స్తులు కోరుతున్నట్లు పోలీసు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నియామకాలు పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన జరగనున్నాయి. దేశ రక్షణలో శాంతిభద్రతల పరిరక్షణ లో అనుభవం ఉన్న మాజీ సైనికు లు, మాజీ పారామిలిటరీ బలగాలు, రిటైర్డ్ పోలీస్ సిబ్బందిని ఈ విధుల్లోకి తీసుకో నున్నారు.

ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులకు ఈ నియామకాల్లో ప్రాధా న్యం ఇవ్వబడు తుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే మాజీ సైనికుల వయస్సు 31 జనవరి 2026 నాటికి 58 ఏళ్లలోపు ఉండాలి. అలాగే మా జీ పారామిలిటరీ, రిటైర్డ్ పోలీస్ సి బ్బంది ఉద్యోగ విరమణ చేసిన రెం డు ఏళ్లలోపు వారై ఉండాలి. వయో ప రిమితి 62 ఏళ్లు మించకూడదు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 26,000 గౌరవ వేతనం చెల్లిస్తారు.

అర్హత గల అభ్యర్థులు అన్ని ధ్రువపత్రాలు, వాటి జిరాక్స్ ప్రతులతో వ్యక్తిగతంగా హైదరాబాద్‌లోని పేట్లబుర్జ్ వద్ద ఉన్న ఆఫీస్, హెడ్‌క్వార్టర్స్ ను సందర్శించి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను స్వీకరించడానికి మార్చి 5వ తేదీ సాయంత్రం 5:00 గంటల వరకు అనుమతిస్తారు. అభ్యర్థులు నేరుగా కార్యాలయానికే రావా లని డీసీపీ సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్ అండ్ ట్రైనింగ్ ఒక ప్రకటనలో స్ప ష్టం చేసింది.