calender_icon.png 18 February, 2026 | 9:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెస్ట్ అవైలబుల్ స్కూల్ కోసం దరఖాస్తులు చేసుకోవాలి

18-02-2026 07:48:58 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో షెడ్యూలు కులాల అభివృద్ధి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా అధికారి దయానంద్ తెలిపారు. బెస్ట్ అవైలబుల్ రెసిడెన్షియల్ నాన్ రెసిడెన్షియల్ ప్రవేశాల రుసుము ప్రభుత్వమే చెల్లిస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు మార్చ్ 15 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని హార్డ్ కాపీని కార్యాలయంలో అందించాలని సూచించారు. ఇతర వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని పేర్కొన్నారు