12 June, 2026 | 1:22 AM

ఎరువుల దుకాణాలు తనిఖీ చేసిన ఏఓ

12-06-2026 12:13 AM

నాగల్ గిద్ద, జూన్ 11: నాగలిగిద్ద మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్ చారి మండలంలోని విత్తన, ఎరువుల దుకాణాలు, గోదాములను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టాక్ రిజిస్టర్లు, బిల్లు బుక్కులను పరిశీలించి నిబంధనల అమలుపై ఆరా తీశారు.

వ్యవసాయ అధికారి మాట్లాడుతూ రైతులకు విక్రయించిన విత్తనాలు, ఎరువులకు తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలని, అధిక ధరలకు విక్రయించరాదని దుకాణ యజమానులకు సూచించారు. అలాగే రైతులు తొలకరి వర్షాలను చూసి తొందరపడి విత్తనాలు వేయకుండా, భూమి పూర్తిగా తడిసిన తర్వాతే విత్తనాలు విత్తాలని సూచించారు.

అనంతరం షాపూర్, ఎస్కి గ్రామాల్లో పర్యటించిన ఆయన, ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఏఈఓలకు ఆదేశించారు. వారితోపాటు ఏఈఓ లు సావిత్రి, మహిపాల్ ఉన్నారు.