2 August, 2026 | 5:22 PM

జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం

02-08-2026 04:02 PM

29 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల

వనపర్తి , ఆగస్టు 2 (విజయక్రాంతి) : జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. వరద నీరు అధికంగా వస్తుండటంతో ప్రాజెక్టు అధికారులు 29 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1,63, 000 క్యూసెక్కుల నీరు చేరుతుండగా, 1,77,370 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 317.33 మీటర్లుగా నమోదైంది. అలాగే ప్రాజెక్టులోని 11 విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల ద్వారా 434 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోందని అధికారులు తెలిపారు. వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రాజెక్టు పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అవసరమైన చర్యలు చేపడుతున్నారు.