2 August, 2026 | 5:04 PM

నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక ప్రకటన

02-08-2026 03:51 PM

కంచనపల్లి : నల్లొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెట్టి(Minister Komatireddy Venkat Reddy ) కీలక ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలు మాట ఇస్తేనే పోటీ చేస్తానని పేర్కొన్నారు. ప్రజలు హామీ లేకుంటే ఎన్నికల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. తాను ఎన్నికల ప్రచారానికి రాకపోయినా చేసిన అభివృద్ధి చూసి ఓట్లు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసినా తనకు సొంత ఇల్లు, ఆస్తులు లేవన్నారు. అద్దె ఇంట్లో ఉంటున్నా.. వారసత్వంగా వచ్చిన భూమి మాత్రమే ఉందని మంత్రి వెంకట్‌రెడ్డి వెల్లడించారు.

నల్లగొండ మండలం కంచనపల్లి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి ఈ మేరకు వ్యాఖ్యానించారు. కంచనపల్లిని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దుతానని మంత్రి హామీ ఇచ్చారు. రాబోయే మూడేళ్లు నల్లగొండ అభివృద్ధిపైనే ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. వారానికి రెండు రోజులు నియోజకవర్గంలోని ప్రజలకు అందుబాటులో ఉంటానన్న మంత్రి ఏ పేదవాడికి కష్టం వచ్చినా వారికి అండగా తాను ఉంటానని తెలిపారు.