2 August, 2026 | 4:58 PM

ఉషోదయ యూత్ నూతన కార్యవర్గం ఎన్నికలు

02-08-2026 03:41 PM

కొండపాక, ఆగష్టు 2(విజయక్రాంతి): కొండపాక మండలం దుద్దెడ గ్రామానికి చెందిన ఉషోదయ యూత్ అసోసియేషన్ (UYA) నూతన కార్యవర్గాన్ని ఆదివారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షుడిగా గూడెం శంకర్, ఉపాధ్యక్షుడిగా తూర్పు గున్నాల సత్యం గౌడ్, ప్రధాన కార్యదర్శిగా కాసాని మహేందర్ రెడ్డి, కోశాధికారిగా గున్నాల కిషోర్ గౌడ్ ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు తమపై ఉంచిన నమ్మకానికి సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాభివృద్ధి, యువతలో సామాజిక సేవా స్ఫూర్తిని పెంపొందించడం, విద్య, క్రీడలు, పర్యావరణ పరిరక్షణ, రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

సంఘం అభివృద్ధికి ప్రతి సభ్యుడు సహకరించాలని కోరుతూ, ఉషోదయ యూత్ అసోసియేషన్‌ను మరింత బలోపేతం చేసేందుకు అందరి సహకారంతో ముందుకు సాగుతామని నూతన కార్యవర్గం తెలిపింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు అభినందనలు తెలియజేసారు. అనంతరం స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఒకరికొకరు అందజేసుకున్నారు.