2 August, 2026 | 5:23 PM

ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని విజయవంతం చేయాలి

02-08-2026 04:01 PM

 బెజ్జూర్ ఆగస్టు 2 (విజయక్రాంతి): కుంరం భీమ్ జిల్లా బెజ్జుర్ మండలకేంద్రంలోని ఆదివాసీ భవనంలో మండలధ్యక్షులు కోరేత తిరుపతి అధ్యక్షతన ఆదివాసీ గ్రామాల పటేల్ లు ఉద్యోగులు ఉద్యోగా సంఘాల నాయకులు సర్పంచ్ లు వివిధ గ్రామాల ప్రజలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ మండల కేంద్రం లోని కొమురం భీమ్ విగ్రహం వద్ద జరుపుకునే ప్రపంచ ఆదివాసీ దినోత్సవంను ఆదివాసులందరు ఒక పండుగలాగా జరుపుకోవాలని ఆదివాసుల సాంస్కృతిక, సంప్రదాయాలను ప్రతిబింబిచేలా నిర్వహించాలని పిలుపునిచ్చారు.మండలంలోని ఆదివాసీ సర్పంచులు, గ్రామాల పటేల్లు అధిక సంఖ్యలో ప్రజలను తీసుకుని వచ్చే బాధ్యత తీసుకొని అధిక సంఖ్యలో ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు.

ఉద్యోగ సంఘాల బాద్యులు,ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు,యువజన సంఘాల నాయకులు,యువకులు మరియు మహిళా సంఘ నాయకురాలు మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి ఆగస్టు 9 వ తేదీన జరుపుకొనే ప్రపంచ  ఆదివాసీ దినోత్సవం ను విజయవంతం చేయాలనీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం గౌరవ అధ్యక్షులు సిడం సకారం, సర్పంచ్ తొర్రెమ్ బానయ్య, ఉపాధ్యాయులు తలండి లక్ష్మణ్, తలండి రాములు, ఆదివాసి కోలావర్ నాయకులు మానేపల్లి మల్లేష్ ఆత్రం బక్కయ్య పెద్దల సంతోష్ పెద్దల శంకర్ మేకల శ్యామ్ రావు ఆదివాసి కోలావర్ మండల ఉపాధ్యక్షులు, మండిగ సత్యవాను నైతం సత్తయ్య ఎడ్ల మహేష్ ఆత్రం సుధాకర్, వివిధ గ్రామాల పటేల్లు ప్రజలు పాల్గొన్నారు.