సీసీ రోడ్డు, సీసీ డ్రైన్ పనులకు శంకుస్థాపన
50 లక్షల నిధులతో సీసీ రోడ్డు, సీసీ డ్రైన్ పనులకు శంకుస్థాపన
ముకరంపుర, ఆగస్టు 2(విజయక్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా నగరంలోని 24వ డివిజన్‌లోని గుండు హనుమాన్ టెంపుల్ సమీపంలో రూ.50 లక్షల UIDF నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు మరియు సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ , నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ తో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నగరంలోని ప్రతి డివిజన్‌లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ప్రజలకు మెరుగైన రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రత్యేక నిధులతో అభివృద్ధి పనులు చేపడుతోందన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వై. సునీల్ రావు , స్థానిక కార్పొరేటర్ ఒంటెల సత్యనారాయణ రెడ్డి , జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి , కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీవాసులు పాల్గొన్నారు.






