calender_icon.png 11 February, 2026 | 5:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగానికి 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా తప్పనిసరి

11-02-2026 12:00:00 AM

ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్, ఫిబ్రవరి 10 (విజయ క్రాంతి): ఈ నెల 11న జరగనున్న జిల్లాలోని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్, చొప్పదండి హుజురాబాద్ జమ్మికుంట మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వెళ్లే సమ యంలో ఓటర్ స్లిప్పుతో పాటు 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి తప్పనిసరిగా వెంట తీసుకురావాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఓటర్ల సౌకర్యార్థం ఎన్నికల కమిషన్ అనుమతించిన గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకటిని చూపించి ఓటు హక్కును వినియోగించు కోవచ్చని తెలిపారు.

ఓటర్ గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ జాబ్ కార్డు, ఫోటోతో కూడిన పోస్టాఫీస్ / బ్యాంక్ పాస్బుక్, కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, ఫోటోతో కూడిన ఎస్సీ / ఎస్టీ / బీసీ కుల ధృవీకరణ పత్రాలు, భారతీయ పాస్పోర్టు,ఫోటోతో కూడిన పెన్షన్ డాక్యుమెంట్, కేంద్ర / రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఉద్యోగ గుర్తింపు కార్డు, ఎంపీ / ఎమ్మెల్యే / ఎమ్మెల్సీ అధికారిక గుర్తింపు కార్డు, దివ్యాంగుల గుర్తింపు కార్డు, పట్టాదార్ పాస్ పుస్తకం, రేషన్ కార్డు, ఫోటోతో కూడిన ఆయుధ లైసెన్స్, స్వాతంత్య్ర సమరయోధుల ఐడీ కార్డు, ఆర్జీఐ ద్వారా జారీ చేయబడిన ఎన్పీఆర్ స్మార్ట్ కార్డులలో ఏదైనా ఒకటి చూపించి ప్రతి అర్హత కలిగిన ఓటరు తన ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి కోరారు.

ఉద్యోగులకు ఎన్నికల సెలవు

 ఈనెల 11న జరగనున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల పోలింగ్ సందర్భంగా, ఆయా ప్రాంతాల్లో ఓటు హక్కు కలిగిన తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులందరికీ ప్రత్యేక సాధారణ సెలవు మంజూరు చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా కలెక్టర్ అమ్మాయిల సత్పతి తెలిపారు.