మరో 42 మంది లొంగుబాటు
- మావోయిస్టు పార్టీ నాయకుడు కేశాలు సహా 41 మంది ఛత్తీస్‌గఢ్ క్యాడర్..
- ఇక తెలంగాణ నుంచి మిగిలింది ఐదుగురే: డీజీపీ శివధర్‌రెడ్డి
సికింద్రాబాద్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): దశాబ్దాలుగా కొనసాగుతున్న సాయుధ పోరాటానికి తెరదించుతూ మావోయిస్టు పార్టీ పీఎల్డీఏ బెటాలియన్ సభ్యులు భారీ సంఖ్యలో జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ బీ శివధర్‌రెడ్డి ఎదుట శుక్రవారం 42 మంది మావోయిస్టులు తమ ఆయుధాలతో సహా లొంగిపోయారు. ఈ లొంగుబాటులో అత్యంత ప్రధానమైన వ్యక్తి పీఎల్డీఏ బెటాలియన్ డిప్యూటీ కమాండర్ కేశాలు ఉన్నారు.
బెటాలియన్ కమాండర్ దేవన్న ఇప్పటికే లొంగిపోవడంతో, కేశాలు నేతృత్వంలో కొనసాగుతున్న ఈ బృందం తాజాగా పోలీసులకు లొంగిపోయింది. వీరితో పాటు డివిజనల్ కమిటీ, ఏరియా కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్టులు తమ వెంట తెచ్చిన సుమారు 40 అత్యాధునిక ఆయుధాలను (ఏకే 47, ఇన్సస్, ఎస్‌ఎల్‌ఆర్) డీజీపీకి అప్పగించారు. లొంగిపోయిన 42 మందిలో 41 మంది ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందినవారు కాగా, తెలంగాణకు చెందినవారు ఒక్కరు మాత్రమే ఉన్నారని డీజీపీ తెలిపారు.
ఛత్తీస్‌గఢ్ అడవుల్లో ఇటీవల భద్రతా బలగాల కూంబింగ్ తీవ్రతరం కావడంతో.. తెలంగాణ సురక్షితమైన ప్రాంతంగా భావించి మావోయిస్టులు తెలంగాణ పోలీసులను ఆశ్రయించిన ట్లు తెలిపారు. తెలంగాణలో పీఎల్డీఏ బెటాలియన్ పూర్తిస్థాయిలో కనుమరుగైందని డీజీపీ శివధర్‌రెడ్డి చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో క్రియాశీలక మావోయిస్టు కేడర్ లేదని చెప్పారు. దీనితో తెలంగాణ ఇప్పుడు పూర్తిస్థాయిలో మావోయిస్టు రహిత రాష్ట్రంగా అవత రించిందని గర్వంగా ప్రకటిస్తున్నానన్నారు.
ఇక రాష్ట్రం నుంచి జనజీవనస్రవంతిలోకి రావల్సిన మావోయిస్టు పార్టీ నాయకులు ఐదుగు రే ఉన్నారని డీజీపీ తెలిపారు. ఒకప్పటి మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతి బతికే ఉన్నారని, అయితే ఆయన అడవుల్లో లేరని డీజీపీ తెలిపారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వ నిబం ధనల ప్రకారం తక్షణ ఆర్థిక సాయం, పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అడవుల్లో ఇంకా మిగిలి ఉన్న వారు కూడా ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
లొంగిపోయిన మావోయిస్టులు: సోడి మల్ల @ కేశాల్ @ నిఖిల్ (42), మడవి మాడ @ రవీందర్ (30 ఏళ్లు), పునేం సుక్కు (35 ఏళ్లు), హేమ్లా లచ్చి @ మాసే @ శీల (42), సోడి భీమా @ రంజిత్ (25 ఏళ్లు), తాటి రాజు @ రంజిత్ (28 ఏళ్లు), కోవ్యాసి రాజు @ రమేష్ (28 ఏళ్లు), మూడియం భీమా @ రింకు (26 ), మడకం భీమా @ సునిత (28 ఏళ్లు), పొడియం గంగి @ సుందరి (22), సోడి భీమి @ మాలతి (30 ఏళ్లు), కుడం దేవి (24 ఏళ్లు), మడకం జోగి (28 ఏళ్లు), పునేం ఐతె @ పార్వతి (27 ఏళ్లు), పొడియం సుంబారి అంజలి (20 ఏళ్లు), మడకం ఇడుమ @ నరేష్ (24), కుంజం భీమా (23 ఏళ్లు), మడకం ఇడుమ (23 ఏళ్లు), మడవి జోగా (25 ఏళ్లు), కుంజం సోను @ నవీన్ (20 ఏళ్లు), పునేం సోము @ రాకేష్ (20 ఏళ్లు), చాప నారాయణ @ గజేందర్ @ మధు (40 ఏళ్లు), కడి సన్ను @ మంతు (40 ఏళ్లు), మోడియం మున్ని మంజుల (43 ఏళ్లు), కుంజం ఇడుమాల్ మహేందర్ (30 ఏళ్లు), సుపో డొంగ @ సునీల్ (30 ఏళ్లు), పొడియం లక్ష్మి (28 ఏళ్లు), ముస్సాకీ దేవే (30 ఏళ్లు), డోడ్డి సోముడు @ శంకర్ (26), మడవి సోమిడి @ లత (23 ఏళ్లు), కరటం ఉరే @ రంజిత (22 ఏళ్లు), పునేం రామే @ క్రాంతి (20 ఏళ్లు), పునేం మోట్టు @ జగ్గు (30 ఏళ్లు)34. డోడ్డి ఐతు @ కిషోర్(40 ఏళ్లు), గోన్నే హిడిమె (22 ఏళ్లు), కుంజం లచ్చు (28 ఏళ్లు), పూనేం శాంతి @ సునీత (30 ఏళ్లు), మడకం బుద్ర (45 ఏళ్లు), కుంజం భీమా (30 ఏళ్లు), మడకం ఉంగి (21 ఏళ్లు), రవ్యా సన్నా @ గుడ్డు (18 ఏళ్లు), ఆప్కా శ్రీను (20 ఏళ్లు).




