12 June, 2026 | 2:30 AM

మహిళా సమాఖ్య ఆర్థిక స్వావలంబన దిశగా మరో ముందడుగు

12-06-2026 12:08 AM

అయిజ, జూన్ 11: అయిజ మండల మహిళా సమాఖ్య ఆర్థిక స్వావలంబన దిశగా మరో ముందడుగు వేసిందని ఏపిఏం వీర్ కుమార్ అన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మహిళా సమాఖ్య నిధులతో ఒక బస్సును కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెరూపంలో ఇస్తున్నట్టు ఆయన తెలిపారు.

నెలకు 70 వేల రూపాయలు అద్దె చొప్పున  గద్వాల ఆర్టీసీ డిపోకి బస్సును మహిళ సమాఖ్య అందజేసింది. మహిళ అభివృద్దె రాష్ట్ర అభివృద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో భాస్కర్ యాదవ్ సమాఖ్య సిబ్బంది  జయాకర్,సుదర్శన్, ఆంజనేయులు, మహిళ సమాఖ్య అధ్యక్షులు మాసమ్మ,మరియు మహిళలు మొదలగువారు పాల్గొన్నారు.