12 June, 2026 | 3:43 AM

యువతి అదృశ్యం

12-06-2026 12:09 AM

ఘట్ కేసర్, జూన్ 11 (విజయక్రాంతి): ఓ యువతీ అదృశ్యమైన సంఘటన పోచారం ఐటి కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాంపల్లి సమీపంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో నివాసం ఉంటున్న చిట్యాల లక్ష్మి కూతురు చిట్యాల రేవతి(20) గతంలో కొత్తపేటలోని ఒక కంపెనీలో పని చేసేదని ఇటీవల సికింద్రాబాద్ లోని మరో కంపెనీలో చేరినట్లు తెలిపారు. 10వ తేదీన రేవతి తన విధులకు హాజరయ్యేందుకు ఇంటి నుండి బయలుదేరింది.

ఆ సమయంలో ఆమె వైట్ టాప్, బ్లాక్ ప్యాంట్స్ ధరించి ఉంది. ఆతర్వాత ఆమె ఇంటికి తిరిగి రాకపోవడం, మొబైల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. బంధువులు, తెలిసిన వారి వద్ద ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో రేవతి తల్లి చిట్యాల లక్ష్మి పోచారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.