5 April, 2026 | 7:30 PM

శ్రేయాస్ అయ్యర్‌కు మళ్లీ షాక్

05-04-2026 01:37 AM

స్లో ఓవర్‌రేట్‌తో రెండోసారి ఫైన్

ముల్లాన్‌పూర్, ఏప్రిల్ 4 : పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్య ర్‌కు మళ్లీ షాక్ తగిలింది. స్లో ఓవర్‌రేట్ కారణంగా రెండోసారి జరిమానాకు గురయ్యాడు. చెన్నై సూపర్‌కింగ్స్‌తో మ్యాచ్ లో పంజాబ్ బౌలర్లు నిర్ణీ త సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయలేదు. దీంతో మ్యా చ్ అనంతరం రిఫరీ ఐపీఎల్ రూల్స్‌కు అనుగుణంగా ఫైన్ విధించారు. ఐపీఎల్ ఆర్టికల్ 2.22 ప్రకారం పంజాబ్ సరైన సమయంలో ఓవర్లు పూర్తి చేయలేకపోవడంతో చర్యలు తీసుకున్నారు.

పంజాబ్‌కు స్లో ఓవర్ రేట్ జరిమానా పడడం ఇది రెండోసారి. తొలి మ్యాచ్‌లో రూ.12 లక్షల జరిమానా ఎదుర్కొన్న శ్రేయాస్ అయ్యర్‌కు ఇప్పుడు రూ.24 లక్షలు ఫైన్ పడింది. రెండోసారి తప్పు చేయడంతో పం జాబ్ జట్టు మొత్తానికీ జరిమానా విధించారు. ఇంపాక్ట్ ప్లేయర్‌తో సహా ఆటగాళ్లందరికీ ఆరు లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించనున్నారు. కాగా ఈ సీజన్‌లో మరోసారి పంజాబ్ స్లో ఓవర్‌రేట్ తప్పిదానికి పాల్పడితే మాత్రం భారీ మూల్యం చెల్లించుకో వాల్సి ఉంటుంది. అప్పుడు శ్రేయాస్ భారీ జరిమానాతో పాటు ఒక మ్యాచ్ నిషేధాన్ని ఎదుర్కొంటాడు.