5 April, 2026 | 1:11 PM

ధోనీ రికార్డు బ్రేక్ చేసిన రోహిత్

05-04-2026 01:38 AM

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4 : ముంబై ఇండియ న్స్ విధ్వంసకర బ్యాటర్ రోహిత్ శర్మ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఓ ప్రత్యర్దిపై అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.  ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్ లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఓ సిక్సర్ బాదిన రోహిత్.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై తన సిక్సర్ల సంఖ్యను 51కి పెంచుకున్నాడు. 

తద్వారా ఐపీఎల్లో ఓ ప్రత్యర్దిపై అత్యధిక సి క్సర్లు బాదిన జాబితాలో మహేంద్రసింగ్ ధో నీని అధిగమించాడు. ధోని ఆర్సీబీపై 50 సి క్సర్లు బాదాడు. ఈ జాబితాలో రోహిత్, ధోనీ తర్వాతి స్థానంలో విరాట్ కోహ్లి ఉన్నా డు. విరాట్ కోహ్లీ చెన్నై సూపర్‌కింగ్స్‌పై 48 సిక్సర్లు బాదాడు. 

ఓవరాల్‌గా ఐపీఎల్‌లో ఓ ప్రత్యర్దిపై అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు క్రిస్‌గేల్ ఖాతాలో ఉంది. గేల్ పంజాబ్ కిం గ్స్‌పై 61, కోల్‌కతాపై 54 సిక్సర్లతో తొలి రెం డు స్థానాలను ఆక్రమించాడు. ఇదిలా ఉంటే రోహిత్ శర్మ ఈ ఐపీఎల్ సీజన్‌ను అద్భుతం గా ప్రారంభించాడు. తొలి మ్యాచ్‌లో కోల్‌కతాపై మెరుపు అర్ద సెంచరీ చేశాడు.38 బం తుల్లో 78 పరుగుతో అదరగొట్టిన హిట్‌మ్యాన్ ఢిల్లీ క్యాపిటల్స్‌పై 26 బంతుల్లో 35 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో రోహిత్ రెండో ప్లేస్‌లో ఉన్నాడు.