30 June, 2026 | 1:40 AM

కిమ్స్ హాస్పిటల్స్ మరో ఘనత

30-06-2026 12:42 AM

ప్రపంచంలో తొలి ఏఏసీఐ మల్టీ-సైట్ అక్రిడిటేషన్ సాధించిన ఆస్పత్రి

హైదరాబాద్, జూన్ 29 (విజయక్రాంతి): అమెరికన్ అక్రిడిటేషన్ కమిషన్ ఇంటర్నేషనల్ (ఏఏసీఐ) నుంచి ఏఏసీఐ మల్టీ-సైట్ అ క్రిడిటేషన్ పొందిన ప్రపంచంలోనే తొలి హెల్త్‌కేర్ నెట్వర్క్‌గా కిమ్స్ హాస్పిటల్స్ నిలిచింది. ఈ గుర్తింపు ద్వారా కిమ్స్ తన ఏడు ఆసుపత్రుల్లో ఒకే నాణ్యతా ప్రమాణాలు, రోగి భద్రత, క్లినికల్ అత్యుత్తమత, పరిపాలన, నిరంతర నాణ్యతాభివృద్ధి వ్యవస్థలను విజయ వంతంగా అమలు చేస్తున్నట్లు అంతర్జాతీయంగా ధృవీకరణ పొందింది.

కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ సీఎండీ డా. భాస్కర్‌రావు మాట్లాడుతూ, మూడు సంవత్సరాల క్రితం ఒక యూనిట్‌కు ఏఏసిఐ అక్రిడిటేషన్ లభించగా, ఇప్పుడు అదే నాణ్యతా వ్యవస్థను మ రో ఆరు ఆసుపత్రులకు విస్తరించి మొత్తం నె ట్వర్‌కలో అమలు చేశామని తెలిపారు. కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ డైరెక్టర్ అనిత మాట్లాడుతూ, ఈ విజయానికి ఏడు ఆసుపత్రుల వైద్యులు, నర్సులు, నాణ్యతా బృందాలు, పరిపాలనా సిబ్బంది, నాయకత్వం సమిష్టి కృషి కారణమని తెలిపారు.

ముఖ్యంగా కిమ్స్ గ్రూప్ ఆఫ్ క్వాలిటీ విభాగం జీఎం సుష్మ కాటూరి చేసిన కృషి అభినందనీయమని పేర్కొన్నారు. ఏఏసిఐ గ్రూప్ సీఈఓ క్రెసో ఆంటోనియో పాలిస్కా మాట్లాడుతూ.. ప్రపంచంలో తొలి ఏఏసిఐ మల్టీ-సైట్ అక్రిడిటేషన్ సాధించడం ద్వారా కిమ్స్ హాస్పిటల్స్ ప్రపంచ ఆరోగ్యరంగానికి కొత్త ప్రమాణాన్ని నెలకొల్పిందన్నారు.

ఏఏసిఐ ఇండియా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా రీజినల్ సీఈఓ ధీరజ్ ఖతోరే మాట్లాడుతూ, ఇది కేవలం ఒక అక్రిడిటేషన్ మాత్రమే కాకుండా ప్రపంచ ఆరో గ్యరంగానికి మైలురాయిగా నిలిచిందన్నారు. ఈ గుర్తింపుతో కిమ్స్ హాస్పిటల్స్ భారతదేశంతో పాటు ప్రపంచ ఆరోగ్యరంగంలోనూ నాణ్యత, రోగి భద్రత, క్లినికల్ అత్యుత్తమతకు ఆదర్శంగా నిలిచిందని సంస్థ వెల్లడించింది.