భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌గా అంకిత్
26-02-2026 11:14 AM
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గా అంకిత్ ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న జితేష్ వీ పటేల్ ను టీజీ.ఎన్ పీడీసిఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా నియమించారు. ఆయన స్థానంలో ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్గా(Additional Collector of Nizamabad District) విధులు నిర్వహిస్తున్న అంకిత్ నో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.




