2 July, 2026 | 12:26 PM

Breaking News

వృద్ధురాలు దారుణ హత్య..?   •   స్కామ్ నిరూపిస్తే.. ముక్కు నేలకురాసి రాజీనామా చేస్తాం: మంత్రి పొన్నం   •   తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •  

అంగన్వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

17-04-2026 12:38 AM

కౌన్సిలర్ మలగం రమేష్ 

మిర్యాలగూడ, ఏప్రిల్ 16  :గర్భిణీలు బాలింతలు ఆరుఏండ్ల లోపు చిన్నారులు అంగన్వాడీ కేంద్రాలలో అందిస్తున్న పౌష్టిక ఆహారంతో పాటు ప్రీ స్కూల్ విద్య సద్వినియోగం చేసుకోవాలని 44వ వార్డు కౌన్సిలర్ మలగం రమేష్ కోరారు. గురువారం సీతారాంపురం అంగన్వాడీలో ఏర్పాటు చేసిన పోషణ పక్వాడలో భాగంగా ఎర్లీ చైల్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

అంగన్వాడీల్లో అందించే చిరుధాన్యాలు, మిల్లెట్స్, పాలపదార్థలు  తీసుకోవడం ద్వారా పోషకవిలువలు పెంపొందించు కోవాలన్నారు. పిల్లల మానసిక శారీరక ఎదుగుదలకు అవసరం ఆయిన టీకాలతో పాటు ఆటపాటల నడుమ సృజనాత్మకతతో కూడిన కార్నర్స్ ఉపయోగిస్తూ పిల్లలకు జరిపే  బోధనలు వారి మానసిక ఎదుగుదలకు ఉపకరిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ చిలిపి రెడ్డి  పద్మ, అంగన్వా టీచర్లు రమాదేవి, మీనాక్షి,  విజయ, మేరాజ్ సుల్తానా, షాహిన్,  మల్లీశ్వరి ఏఎన్‌ఎం  శోభారాణి తదితరులు పాల్గొన్నారు.