14 July, 2026 | 11:21 AM

Breaking News

విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అక్రమ అరెస్టులా?   •   తగ్గిన రూపాయి విలువ.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు   •   కనుగుట్ట శబరిమాత ఆశ్రమానికి నిధుల మంజూరుకి హామీ   •   గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులది కీలక పాత్ర   •   చలో సచివాలయం నేపథ్యంలో సీపీఎం నాయకుల అరెస్ట్   •   Strait of Hormuz Crisis: ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు.. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్ వార్నింగ్   •   CM Revanth Reddy Delhi Tour: కేంద్ర మంత్రులతో కీలక భేటీలు.. తెలంగాణ ప్రాజెక్టులపై నేడు కీలక చర్చలు   •   జోగులాంబ క్షేత్రంలో భక్తి వైభవం   •   సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ పాలన   •   వనపర్తి అభివృద్ధే మా లక్ష్యం.. ప్రజల తీర్పే కాంగ్రెస్‌కు బలం   •  

పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

05-10-2025 06:45 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): పూర్వ విద్యార్థుల అపూర్వాంగా రెండు దశబ్దాల తర్వాత తాము చదువుకున్నచోటే కలుసుకున్నారు. బెల్లంపల్లి పట్టణంలోని బజార్ ఏరియా హై స్కూల్ లో 2004-05 లో పదవ తరగతి చదువుకున్న విద్యార్థులు ఆదివారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అపూర్వంగా కలుసుకొని పాత జ్ఞాపకాలు నెమరేసుకున్నారు. 120 మంది విద్యార్థులకు గాను 100 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్బంగా పూర్వ ఉపాధ్యాయులు ఎర్ర సువర్ణ, అబ్దుల్ లతీఫ్, సరోజ లక్ష్మి, శ్రీనివాస్ గౌడ్, శ్రీలత, కుమార్ లు మాట్లాడారు. నాటి విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగి పలు ఉద్యోగాల్లో స్థిరపడటం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా పూర్వ ఉపాధ్యాయులను విద్యార్థులు శాలువ పూలమాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు సారయ్య వెంకటేష్, కృష్ణ, సుమన, ఆశీస్, కల్పన, సంధ్య, తిరుమల తదితరులు పాల్గొన్నారు.