10 May, 2026 | 11:45 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

మానవత్వానికి మానని గాయం

26-02-2026 01:57 AM

కుమ్మెర ఘటనపై తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ కన్నీటి ప్రకటన

హైదరాబాద్, ఫిబ్రవరి 25 (విజయక్రాం తి): ‘పశువులు సిగ్గుపడేలా కాళ్లతో తన్ని, పసికూనతోపాటు రాజ్యాంగాన్ని ఖననం చేసినారు కదా’ అని కుమ్మెర ఘటనపై బహుజన ఉద్యమ కవి, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీశంక ర్ తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం నాగర్‌కర్నూల్ అంబేద్కర్ సెం టర్‌లో కుమ్మెర బాధితుల దీక్షా శిబిరంలో బాధితురాలైన తల్లి మౌనికను జూలూరు గౌరీశంకర్ పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. సర్వసత్తాక గణతంత్ర కులాతీత, మతాతీత జన రాజ్యాంగమా.. ఈ ప్రవేశిక ఆ పాపతో పాటు పం పించేయ్ అని నిరసనను వ్యక్తం చేశారు. మానవత్వానికి మానని గాయం చేసిన కుమ్మెర లాంటి ఘటనలు తిరిగి పునరావృ తం కాకూడదని కలత చెంది కన్నీళ్ళతోనే రాస్తున్నామని పేర్కొన్నారు.

వేయి పడగలు విప్పి పగతో బుస కొట్టే ఆదిపత్య కొమ్ములను విరిచేందుకు ‘వెనుకబడిన కులాలు -వెంటాడే కలాలై ‘ పదునెక్కుతాయని, బడుగుల యుద్ధకావ్యాలను ఆవిష్కరిస్తాయని కవితాత్మకంగా జూలూరు పేర్కొన్నారు. దీక్షా శిభిరంలో తెలంగాణ వికాస సమితి రాష్ట్ర అద్యక్షులు వనపట్ల సుబ్బయ్య, పఖ్యాత రచయిత రమేష్‌బాబు, సామాజిక ఉద్యమ కారులు ఎదిరెపల్లి కాశన్న, లంగాణ సాహితి రాష్ట్ర ఉపాధ్యక్షులు వహీద్ ఖాన్, లంగాణ అరసం రాష్ట్ర నాయకులు కల్వకోల్ మద్దిలేటి, పార్థసారథి, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.