1 March, 2026 | 10:18 PM

విరోష్ జంటకు శుభాకాంక్షల వెల్లువ

28-02-2026 12:00 AM

వెండితెర క్రేజీ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మూడుముళ్ల బంధంతో దంపతులుగా మారి న సంగతి తెలిసిందే. గురువారం ఉదయ్‌పూర్‌లో వీరి వివాహం జరిగింది. అనంతరం ఈ జంట కుటుంబీకులతో కలిసి శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకుంది. ‘విరోష్’ జోడీని చూసేందుకు వచ్చిన అభిమానులతో ఉదయ్‌పూర్, హైదరాబాద్ ఎయిర్‌పోర్టులు కోలాహలంగా మారాయి. ఈ సందర్భంగా అభిమానులకు అభివాదం చేస్తూ, ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.

మరోవైపు ఈ నూతన దంపతులకు అభిమానులు, సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెప్పారు. స్టార్ హీరో నాని, హీరోయిన్లు సమంత, కృతిసనన్‌తోపాటు బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. వీరితోపాటు ఆయుష్మాన్ ఖురానా, విద్యాబాలన్, కాజల్ అగర్వాల్, అనన్యపాండే, నేహా ధూపియా, ఇషాన్ ఖట్టర్, విజయ్ వర్మ, దియా మీర్జా, అర్జున్ కపూర్, రియా చక్రవర్తి వంటి మరికొందరు తారలు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. 

ప్రధాని మోదీని 'విరోష్' జంట...

కొత్త జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని న్యూఢిల్లీలో మర్యాదపూర్వకం గా కలిసిశారు. ఈ సందర్భంగా వారు హైదరా బాద్‌లో జరగనున్న తమ మ్యారేజ్ రిసెప్షన్‌కు ఆహ్వానించారు. అయితే, బిజీ షెడ్యూల్ కారణంగా తాను హాజరుకాలేకపోతున్నానని ఈ సందర్భంగా మోదీ ఈ జంటకు తెలిపినట్టు సమాచారం. వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని దీవిస్తూ విరోష్ జంటకు ప్రధాని శుభాకాంక్షలు తెలియజేశారు. వీరి రిసెప్షన్ వేడుక మార్చి 4న హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణలో జరగనుంది. పలువురు బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నేతలు హాజరు కానున్నారు.