2 March, 2026 | 3:31 AM

మెదక్ జిల్లాలో జూదంపై ఉక్కుపాదం

02-03-2026 12:04 AM
  1. టాస్క్ ఫోర్స్ దాడుల్లో 9 మంది అరెస్ట్
  2. రూ.28,296 నగదు,6 మొబైల్ ఫోన్లు, ఒక కారు, 5 బైక్లు స్వాధీనం
  3. మెదక్ జిల్లా ఎస్పీ. డి. వి. శ్రీనివాస రావు 

మెదక్, మార్చి 1 (విజయ క్రాంతి) : మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం బుజరాంగ్పల్లి గ్రామ శివారులో పేకాట ఆడుతున్న వారిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి 9 మందిని అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు ఆదేశాల మేరకు ఈ ఆపరేషన్ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు.

ఈ దాడుల్లో 9 మంది జూదగాళ్లను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.28,296 నగదు మరియు 6 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిని వడ్ల ఎల్లం, వంజరి మల్లేశం, ఉసికె దుర్గేష్, బక్క వీరేశం, మహంకాళి ప్రకాష్, గుడాల హరి, పనిముక్కలా రామ్ శశిధర్ గౌడ్, గంగారాం మల్లేశం, జాతీగరి కృష్ణగా పోలీసులు గుర్తించారు. వారిని కౌడిపల్లి పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో పేకాట, బెట్టింగ్ వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి అక్రమాల వల్ల అనేక కుటుంబాలు నష్టపోతున్నాయని, ముఖ్యంగా యువత తప్పుదారుల్లోకి వెళ్లకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందించి ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.