2 March, 2026 | 3:35 AM

మదింపు జరగాల్సిందే!

02-03-2026 01:54 AM

కవి తన మనసును మదిస్తేనే

మహాకావ్యం పుడుతుంది !

మానవాళిని మదిస్తేనే

చరిత్ర ఒక యుగ పురుషుణ్ణి

చూస్తుంది !

 

పుడమి గర్భం నుంచి

మొలకెత్తాలంటే.. 

విత్తనం ఎంత పోరాటం చేస్తుందో  తెలుసా?

మట్టిలో అట్టుడికి, నీటిలో నాని

చివరకు రెండుగా చీలి 

మట్టిని చీల్చుకుని మొక్క పుడుతుంది!

అలాంటి మొక్కలన్నీ 

కలిసే ఒక వనం ఏర్పడుతుంది !

చరిత్ర ఎప్పుడూ పోరాటాన్నే

గుర్తు పెట్టుకుంటుంది..

మనం పుట్టామా.. చచ్చామా.. అన్నది కాదు!


యువతా.. మేలుకో.

ఓటమి వచ్చిందని మగ్గిపోవద్దు.. 

ఓటమిని అంగీకరించు.. చతికిలపడొద్దు

మళ్లీ లే..  కాలం నీకు మరొక అవకాశం ఇస్తుంది..

విజయం పూర్ణ కుంభంతో స్వాగతం పలుకుతుంది !

 - కందాళ పద్మావతి