10 August, 2026 | 1:50 AM

పోచమ్మ ఆలయ హుండీలో అమెరికన్ డాలర్

10-08-2026 12:32 AM

మొయినాబాద్, ఆగస్టు 9 (విజయక్రాం తి): మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హిమాయత్నగర్ శ్రీ పోచమ్మ దేవాల యంలో ఆషాఢ మాస బోనాల సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఆదివా రం హుండీ లెక్కింపు చేపట్టగా అమెరికా డా లర్ కనిపించడంతో ఆలయ నిర్వాహకులు, స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇటీవల గ్రామ పరిధిలోని ప్రైవేట్ వెంచర్లకు చెందిన కొందరు వ్యక్తులు గ్రామానికి వచ్చి బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారని, వారిలో ఎవరైనా అమ్మవారిపై భక్తితో డాలర్ను హుండీలో వేసి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు.