11 August, 2026 | 4:44 AM

దాచుకున్న సొమ్ము చెదల పాలు

11-08-2026 01:04 AM
  1. రూ.5లక్షలు భూమిలో దాచిన రైతు
  2. తవ్వి చూడగా చెత్తే మిగిలింది
  3. రాజస్థాన్‌లో వెలుగు చూసిన ఘటన

జైపూర్, ఆగస్టు 10: దొంగలు దోచుకుపోతరానే భయంతో ఓ రైతు ఏడాది క్రితం ఐదు లక్షల రూపాయలు భూమిలో పాతిపెడితే.. ఆ డబ్బంతా చెదల పాలైంది. దీంతో బాధితుడు లబోదిబోమన్నాడు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని నెవాయి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని నెవాయి గ్రామానికి చెందిన రైతు మంగిలాల్ ఏడాది క్రితం తన భూమిలో కొంతభాగాన్ని ఐదు లక్షల రూపాయలకు విక్రయించాడు. ఈ విషయం ఎవరికీ చెప్పకుండా ఆ వచ్చిన సొమ్మును జాగ్రత్తగా ఉంచాలని భావించి ఓ సంచిలో మూటకట్టి వ్యవసాయ భూమిలో పాతిపెట్టాడు. ఆ తర్వాత ఆ డబ్బు దాచిపెట్టిన స్థలం మర్చిపోవడంతో ఆందోళనకు గురయ్యాడు.

అదే విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పాడు. అందరూ కలిసి ఆరెకరాల పొలాన్ని తవ్వి చూసినా డబ్బు దొరకలేదు. ఇటీవల విత్తనాలు వేయడానికి పొలం దున్నుతున్న ప్పుడు డబ్బు సంచి బయటపడటంతో మంగిలాల్ కు టుంబసభ్యులుఆనందపడ్డారు.

తీరా సంచి తెరిచిచూస్తే అందులోని నోట్లను చెదపురుగులు తినేశాయి.వాటిలో స్వల్పంగా దెబ్బతిన్న నోట్లను తీసుకొని ఆ కుటుంబం స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖను సంప్రదించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నోట్ల పరిస్థితి చూసి వాటిని తీసుకునేందుకు బ్యాంకు అధికారులు నిరాకరించడంతో వారు నిరాశతో వెనుదిరిగారు.