అంబేద్కర్ సేవలు ఎనలేనివి
సనత్‌గర్, ఏప్రిల్ 14 (విజయక్రాంతి):- భారత రాజ్యాంగ నిర్మాత, భారత్ రత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా బీజేపీ అంబేద్కర్ యువజన సం ఘం ఆధ్వర్యంలో సనత్నగర్ నెహ్రూ పార్క్ లోని బీజేపీ చౌక్ వద్ద ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని నిర్వాహకుడు రాజా మిధుల్, సమన్వయకర్త రోహిత్ మున్నా ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా నరేందర్, నరేష్, రవి, పురుషోత్తం, కార్తిక్, ఆకాశ్ తదితర సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని బాబా సాహెబ్ అం బేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి ఘన నివాళులు సమర్పించారు. అనంతరం అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ, ఆయన దేశానికి అందించిన రాజ్యాంగం సమానత్వం, న్యాయం, స్వేచ్ఛలకు మార్గదర్శకమని కొనియాడారు.
అంబేద్కర్ గారి ఆశయాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని, సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని నాయకులు పేర్కొన్నారు. యువత ఆయన చూపి న మార్గంలో నడిచి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా బాటసారులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్త లు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు






