15 April, 2026 | 4:00 AM

గురుకుల స్టేట్ ర్యాంకర్‌ను అభినందించిన కలెక్టర్ అంకిత్

15-04-2026 12:22 AM

మున్సిపల్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి బిడ్డకు స్టేట్ ర్యాంక్

కొత్తగూడెం, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హనుమాన్ బస్తీకి చెందిన ఈ. సాత్విక రాష్ట్రవ్యాప్తంగా ర్యాంకును సాధించటం జిల్లా ప్రజలకు ఎంతో ఆనందాన్ని చేకూర్చింది. సాధారణ మున్సిపాలిటీ అవుట్సోర్సింగ్ ఉద్యోగి అయిన ఈ సంతోష్ బాబు, కుమార్తె ఇంతటి ఘనతను సాధించటంతో పాటు , గురుకులంలో ఇంటర్ విద్యను అభ్యసించి రాష్ట్రస్థాయిలో ర్యాంకును సాధించినందుకు జిల్లా కలెక్టర్ సాత్వికను మంగళవారం అభినందించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇంటర్ బైపీసీలో 1000కి 991 మార్కులు సాధించిన ఈ విద్యార్థి, వైరా గురుకుల పాఠశాలలో విద్యా విద్య అభ్యసించి అత్యున్నత ప్రతిభ కనబరిచినందుకు అభినందించారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో అత్యున్నతమైన ప్రతిభగల ఉపాధ్యాయులు సిబ్బంది ఉన్నారనటానికి నిదర్శనం సాత్వికేనని జిల్లా ప్రజలు ప్రైవేట్  విద్యా సంస్థల్లో చదివించే ,వారికి దీటుగా ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులు సైతం ఎవరికి తీసిపోరని నిరూపించిందన్నారు.