కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో ముద్రించాలి
ఢిల్లీపై దండోరా మహా ధర్నాలో పలువురు ఎంపీలు
ముషీరాబాద్, మార్చి 13 (విజయక్రాంతి): ఆర్బిఐ స్ఫూర్తి ప్రదాత డా.బి.ఆర్ అంబేద్కర్ ఫొటోను కరెన్సీ నోట్లపై ముద్రించాలని పార్లమెంటులో కొట్లాడి, ప్రధాన మంత్రి దృష్టికి తీసుకెళ్తామని పలువురు ఎంపీలు హామీ ఇచ్చినట్లు కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి (సీఏపీఎస్‌ఎస్) జాతీయ అధ్యక్షులు డా.జేరిపోతుల పరశురామ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీఏపీ ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో ముద్రించాలని ‘ఢిల్లీపై దం డోరా’ మహాధర్నాను నిర్వహించినట్లు తెలిపారు.
ముఖ్య అతిధిగా ఎంపీలు ఆర్. కృష్ణ య్య, మల్లు రవి, ఈటల రాజేందర్ పాల్గొని ప్రసంగించారని తెలిపారు. ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ అంబేద్కర్ లేకుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదని, ఆ మహనీయుని ఫోటో వేయకపోవడం అంటే చరిత్ర ను విస్మరించడమే అన్నారు. డా.మల్లు రవి, ఈటల రాజేందర్ మాట్లాడుతూ ఈ అంశా న్ని పార్లమెంట్‌లో ప్రస్తావించి ప్రధాని దృష్టి కి తీసుకెళ్తామన్నారు. సీఏపీఎస్‌ఎస్ జాతీయ సలహా దారులు ఆళ్ళ రామకృష్ణ, ఏపీ అధ్యక్షులు కంఠ వేణు, తైకొండ శీను, కొల్లి నాగే శ్వరరావు, దేవరకొండ రమాదేవి, మాపల్లె శంకర్, గ్యార యాకన్న, పులిగిల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.




