అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
డాక్టర్ కోట రాంబాబు
మధిర,(విజయక్రాంతి): అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చెయ్యాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ కోట రాంబాబు అన్నారు. మధిరలోని అంబేద్కర్ సెంటర్ నందు నవశకం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కోట రాంబాబు మాట్లాడుతూ.... అంబేద్కర్ దేశానికి సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం అనే మహత్తర విలువలను అందించిన మహానుభావుడు అని కొనియాడారు.
సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని తెలిపారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చూపిన మార్గాన్ని అనుసరించడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాలని, యువత అంబేద్కర్ గారి ఆలోచనలను ఆచరణలో పెట్టి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు.






