15 April, 2026 | 4:55 AM

డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు ఘన నివాళి

15-04-2026 01:29 AM

అపోలో మెడికల్ అకాడమీలో అంబేద్కర్ జయంతి నిర్వహణ

హైదరాబాద్, ఏప్రిల్ 14(విజయక్రాంతి): రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా  మంగళవారం చైతన్యపురిలోని అపోలో మెడికల్ అకాడమీలో చైర్మన్ పోసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఘన నివాళులర్పించారు. సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం అనే మహత్తర విలువలను మన రాజ్యాంగం ద్వారా అందించిన మహనీయుడని వారు కొనియాడారు.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చూపిన మార్గం సమాజానికి ఎల్లప్పుడూ దిశానిర్దేశం చేస్తూనే ఉంటుందని అకాడమీ ప్రిన్సిపాల్ అలవాల.మధుసూదన్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఫ్యాకల్టీ రాజు, శ్రీధర్, హరిసునిల్,వెంకటరమేష్, నాన్ టీచింగ్ స్టాఫ్ సాయి,శైలజ, సింధు,దివ్య, ప్రవళిక,మమత, విద్యార్థులు పాల్గొన్నారు.