అంగన్వాడీ కేంద్రానికి ‘అమెజాన్’ అండ
రూ. 30 లక్షలతో మోడల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన
కందుకూరు, మార్చి 10 (విజయక్రాంతి):మండల పరిధిలోని కొత్తగూడ గ్రామంలో చిన్నారుల కోసం అన్ని హంగులతో కూడిన అంగన్వాడీ కేంద్రాన్ని నిర్మిస్తామని అమెజాన్ సి.ఎస్.సి మేనేజర్ తాతాజీ ప్రకటించారు. మంగళవారం స్థానిక సర్పంచ్ బొక్క సువర్ణతో కలిసి ఆయన భవన నిర్మాణానికి ఘనంగా శంకుస్థాపన చేశారు. సుమారు 30 లక్షల రూపాయల అంచనా వ్యయంతో ఈ అంగన్వాడీ భవనాన్ని పూర్తిస్థాయిలో నిర్మించనున్నారు. అమెజాన్ సంస్థ పలు గ్రామాలను దత్తత తీసుకుని, అక్కడి మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తోందని తాతాజీ పేర్కొన్నారు.
గతంలో కొత్తగూడలోని ’సున్నపు చెరువు’ను అమెజాన్ సంస్థ సుందరీకరించి, దాని రూపురేఖలను మార్చిన విషయాన్ని సర్పంచ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
అమెజాన్ సంస్థ గ్రామ అభివృద్ధికి చేస్తున్న సేవలు అమోఘం. కేవలం వ్యాపార దృక్పథంతోనే కాకుండా, సామాజిక బాధ్యతగా మా గ్రామానికి సహకరిస్తున్నందుకు సర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచ్ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ముచర్ల రవీందర్, అమెజాన్ ప్రతినిధి సురేష్, అంగన్వాడీ సి.డి.పి.ఓ శాంతి శ్రీ, టీచర్ తల్లోజు సరస్వతి, మాజీ సర్పంచులు రాయిచెట్టు యాదయ్య, సాల మల్లారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సామ ప్రకాష్ రెడ్డి మరియు వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.




