30 June, 2026 | 2:19 AM

చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో హత్య

30-06-2026 01:24 AM

నిందితుడు అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు

కల్వకుర్తి, (ఊరుకొండ ) జూన్ 29: చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో వ్యక్తిని హత్య చేసిన కేసును పోలీసులు ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు కల్వకుర్తి సీఐ భీమ్ కుమార్ సోమవారం వెల్లడించారు. సీఐ కథనం ప్రకారం, ఊరుకొండ మండలం రేవల్లి గ్రామానికి చెందిన యాదయ్య (50) ఈ నెల 26న హత్యకు గురయ్యాడు.

అదే గ్రామానికి చెందిన పోలే ఆంజనేయులు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తన ఆరోగ్య సమస్యలకు యాదయ్య చేతబడి చేయడమే కారణమని అనుమానించి అతనిపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో యాదయ్యను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుని వద్ద నుండి హత్యకు ఉపయోగించిన ఆయుధం బైకు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.

మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించినట్లు సీఐ తెలిపారు. అనంతరం అతడిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. ఈ కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన ఎస్త్స్ర రమాదేవి,  పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించినట్లు సీఐ  తెలిపారు.