జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సుదర్శన్ బాధ్యతల స్వీకరణ
సిద్దిపేట క్రైం, జూన్ 29 : సిద్దిపేట జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జి.సుదర్శన్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించిన ఆయన హైకోర్టు ఉత్తర్వుల మేరకు సిద్దిపేటకు బదిలీపై వచ్చారు. గాడ్ ఆఫ్ హానర్ అనంతరం ఆయన బాధ్యతలు చేపట్టారు.
జస్టిస్ సుదర్శన్ కు ఒకటో అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి వై.జయ ప్రసాద్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎన్.సంతోష్ కుమార్, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి ఎ.కుమారస్వామి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి బి.సాధన, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి వి.తరణి, రెండో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కె.సౌజన్య, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ బాబు, న్యాయవాదులు, కోర్టు అధికారులు, సిబ్బంది, పోలీసులు సాదర ఆహ్వానం పలికారు.






