8 June, 2026 | 7:01 PM

Breaking News

పారా క్రీడాకారులకు రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి   •   ఘనంగా గోపూజ, అన్నదానం   •   జైనూర్ గ్రామ సభలో అభివృద్ధి ప్రణాళికలపై చర్చ   •   నీట్ (యూజీ)-2026 పునఃపరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   10న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను విజయవంతం చేయండి: కళ్లెం కృష్ణ   •   ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి   •   సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తా   •   జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేద్దాం   •   ఈనెల 10న సిద్ధాపూర్ కు మంత్రి ఉత్తమ్ రాక   •   విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి   •  

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

08-06-2026 01:23 AM

వెంకటాపూర్, జూన్ 7 (విజయక్రాంతి): మండలంలోని పాలంపేట ఉన్నత పాఠశాలలో 1996-97 విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు రామప్పలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్న మిత్రులు చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ పాఠశాల రోజులలో జరిగిన మధుర సంఘటనలు, ఉపాధ్యాయులతో ఉన్న అనుబంధం, స్నేహితులతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకున్నారు.

ప్రస్తుతం వివిధ రంగాల్లో స్థిరపడిన సహచరులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ పాత జ్ఞాపకాలను పంచుకున్నారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు స్నేహ బంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు పాఠశాలతో ఉన్న అనుబంధాన్ని తిరిగి గుర్తు చేసే వేదికలుగా నిలుస్తున్నాయని వారు అభిప్రాయపడ్డారు. ఇలాంటి సమావేశాలు విద్యార్థుల మధ్య ఐక్యతను పెంపొందిస్తాయని, భవిష్యత్తులో కూడా తరచూ కలుసుకునేలా ప్రయత్నాలు కొనసాగిస్తామని వారు తెలిపారు.