5 August, 2026 | 7:24 PM

తండ్రి జ్ఞాపకార్థం విద్యార్థులకు స్టీల్ బాటిళ్ళు పంపిణీ

05-08-2026 06:08 PM

పూర్వ విద్యార్థులు పేద విద్యార్థికి ఆర్థిక సాయం

పాఠశాలకు రూ.12,500 విలువైన మైక్ అందజేత

కల్లూరు,(విజయక్రాంతి): స్వర్గీయ సరికొండ రామరాజు జ్ఞాపకార్థం ఆయన కుమారులు కల్లూరులో పీఎం శ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు సుమారు రూ.40 వేల విలువైన 260 స్టీల్ వాటర్ బాటిళ్లను విద్యార్థులకు అందజేశారు.ప్రతి విద్యార్థికి ఉపయోగపడే విధంగా పంపిణీ చేశారు.ఇదే సందర్భంగా 1989-90 బ్యాచ్ పూర్వ విద్యార్థులు పేద విద్యార్థి చదువుకు రూ.35 వేల ఆర్థిక సాయం ప్రకటించారు. అలాగే రూ.12,500 విలువైన సౌండ్ సిస్టం మైక్‌ను పాఠశాలకు అందించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పత్తిపాటి నివేదిత, ప్రోగ్రాం కోఆర్డినేటర్ పసుపులేటి వీర రాఘవయ్య, బండి నాగేశ్వరరావు, మోటమర్రి వేణు, జాఫర్, నాని, మధు వెంకటేశ్వరరావు,బి.శ్రీనివాసరావు కమిలి,ప్రసాద్,పెద్ద పుల్లారావు, పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.