ఇంటర్ ఫలితాల్లో అల్ఫోర్స్ జయకేతనం
కొత్తపల్లి, ఏప్రిల్ 12 (విజయ క్రాంతి): ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలలో ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాలల విద్యార్థులు రాష్ట్రస్థాయి అత్యుత్తమ మార్కులను సాధించి జయకేతనం ఎగురవేశారు. ఆదివారం ప్రకటించిన ఫలితాల్లో సీనియర్ ఇంటర్మీడియట్ ఎంపీసీలో కె పల్లవి 996, జి హైంథవి 996, డి. ప్రణవి 996, వై శ్రీ నిత్య 996 మార్కులతో రాష్ట్రములో అత్యున్నత స్థానంలో నిలిచారు.
ఈ సందర్భంగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ సీనియర్ ఇంటర్మీడియట్ బైపీసీ విభాగంలో అర్ వైష్ణవి 995 కె.హారిక 995, నభిలాతాహేన్ 995, ఎస్. బ్రహ్మాణి 995, ఎస్ ఐశ్వర్య 995 మార్కులు సాధించారని తెలిపారు.
ఎంఈసి విభాగంలో కె. మానస 988, సిఇసిలో పి. బావోజ్ఞ 987 మార్కులు సాధించారని తెలిపారు. జూనియర్ ఇంటర్మీడియట్ ఎంపీసీలో డి వినిష, జి అక్షర, బైపీసీ లో ఎస్ జాగృతి 439, ఏ హస్విత 439, ఖాన్సా అలియా 439, జి కావ్యశ్రీ 439, ఎంఈసీలో ఏమ్ మహాలక్ష్మి 493, సీఈసీలో వి ధిక్షిత 494, అనామ్మహ్రూజ్ 494 మార్కులు సాధించారని తెలిపారు. తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు.




