2 June, 2026 | 9:58 PM

ఉత్తమ సేవలకు అవార్డు అందుకున్న ఏఎల్‌ఎం సుబ్బారావు

02-06-2026 08:24 PM

అశ్వాపురం,(విజయక్రాంతి): తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తమ తమ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ఉద్యోగులకు ప్రదానం చేసిన ఉత్తమ సేవా అవార్డుల్లో భాగంగా మంగళవారం అశ్వాపురం మండలంలోని రామచంద్రాపురం విద్యుత్ విభాగంలో పనిచేస్తున్న ఏఎల్‌ఎం సుబ్బారావు ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకున్నారు. విద్యుత్ శాఖలో లైన్‌మన్‌గా విధులు నిర్వహిస్తూ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు శాఖ అభివృద్ధికి చేసిన కృషికి గుర్తింపుగా తెలంగాణ ఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి చేతుల మీదుగా ఈ అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా సుబ్బారావు సాధించిన ఈ ఘనత పట్ల విద్యుత్ శాఖ అశ్వాపురం సబ్‌ ఇంజనీర్ మణిదీప్, సహోద్యోగులు, మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనను అభినందించారు.