6 March, 2026 | 2:56 AM

అల్ఫోర్స్ విద్యార్థులకు ఇంగ్లిష్ ఒలంపియాడ్‌లో పతకాలు

06-03-2026 01:19 AM

కొత్తపల్లి, మార్చి 5 (విజయ క్రాంతి): కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాల విద్యార్థులు అంతర్జాతీయ ఇంగ్లీష్ ఒలంపియాడ్ లో పతకాలు సాధించారు. పాఠశాల చెందిన ఏ శ్రియాన్ రెడ్డి రజత పతకం, వి వేదవిహార్ బంగారు, జి విశాల్ కాంస్య, కే సుకృత బంగారు, ఏంvలిఖిత్ రజత, బి తన్మయి బంగారు, పి సుశ్రిత్ కాంస్య, ఏం విగ్నేష్ చంద్ర బంగారు, ఎల్ అక్షయ రజత, ఏ యాష్ చంద్ర కాంస్య,

సిహెచ్ శ్రీహిత రజత, టి అమిత విక్రమ్ బంగారు పతకం సాధించారు. పతకాలు సాధించిన విద్యార్థులకు అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి పుష్పగుచ్చాలను అందజేసి అభినందనలు తెలిపి  భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.