మోడల్ కాలేజీలో మెరిసిన అక్షర కుసుమాలు
ప్రతిభ చాటిన విద్యార్థుల సన్మానించి మెడల్స్ అందజేసిన చేవెళ్ళ ఎమ్మెల్యే యాదయ్య
చేవెళ్ళ/షాబాద్ ఏప్రిల్ 23(విజయక్రాంతి): షాబాద్ మోడల్ కాలేజీ, చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలో ఇంటర్మీడియట్ ఫలితాల్లో తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా చేవెళ్ల శాసన సభ్యులు కాలె యాదయ్య, చేవెళ్ళ షాబాద్ మోడల్ కాలేజీ విద్యార్థులను శాలువతో సన్మానించి మోడల్స్ అందజేశారు. షాబాద్ మోడల్ కాలేజీలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జిల్లా గ్రంధాలయ సంస్థల చైర్మన్ ఎలుగంటి మధుసుదన్ రెడ్డి ఎమ్మెల్యేతో కలిసి మెడల్స్ అందజేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ... మోడల్ విద్యార్థులు ప్రతి ఏటా మంది ఫలితాలు సాధించడంతో పాటు రాష్ట్ర స్థాయి ర్యాంకులకు ఎంపిక కావడం పట్ల ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. మోడల్ స్కూల్ & కాలేజీ లో విద్యను అందిస్తున్న ఉపాధ్యాయులు ప్రిన్సిపాల్ సిబ్బందినీ అభినందినిచారు. మోడల్ స్కూల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయులు లెక్చరర్స్ బోధన విధానాన్ని ఇతర ఉపాధ్యాయులు లెక్చరర్స్ ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. విద్యార్థులు మరింత చదివి భవిష్యత్ లో ఉన్నత స్థాయిలకు చేరాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో చేవెళ్ల మున్సిపల్ చైర్ పర్సన్ దేవర సమత వెంకటరెడ్డి, వైస్ చైర్మన్ కాసుల రాము గౌడ్,15 వార్డు కౌన్సిలర్ మాజీ సర్పంచ్ బండారి శైలజ ఆగిరెడ్డి, 14 వార్డు కౌన్సిలర్ మద్దెల శ్రీనివాస్,17 కౌన్సిలర్ కృష్ణ నాయక్,18 వార్డు కౌన్సిలర్ మంగలి కళ్యాణి యాదగిరి, ముడిమ్యాల మాజీ సర్పంచ్ పడాల ప్రభాకర్, పిఏసిఎస్ చైర్మన్ గోనె ప్రతాపరెడ్డి, సర్దార్ నగర్ ఏఎంసి చైర్మన్ పిసరి సురేందర్ రెడ్డి, చేవెళ్ల మాజీ ఉప సర్పంచ్ టేకులపల్లి శ్రీనివాస్, నాయకులు గిరిధర్ రెడ్డి, ఖదీర్ పాష, ఎంఈఓ పురం దాస్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ చిన్నపరెడ్డి, ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాలు విద్యార్థినిలు స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.






