14-02-2026 01:06:34 AM
సీపీఐ 14, సీపీఎం 6 చోట్ల విజయం
హైదరాబాద్, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): శుక్రవారం వెలువడిన మున్సిపల్ ఫలితాల్లో 2౩ స్థానాల్లో ఎంఐఎం గెలుపొందగా, సీపీఐ 14, సీపీఎం 6 చోట్ల విజయం సాధించాయి. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో ఎంఐఎం 6, మహబూబ్ నగర్ కార్పొ రేషన్‌లో 3, నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్‌లో 2, కరీంనగర్ కార్పొరేషన్‌లో 3, జగి త్యాల మున్సిపాలిటీలో 2, వికారాబాద్, తాండూరు, కొడంగల్‌లో, గద్వాల, బాన్సువాడ, ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్, జగి త్యాలలో ఒక్కో స్థానంలో గెలిచింది.
సీపీఐ గెలిచిన స్థానాలు
మంచిర్యాల క్యాతనపల్లి మున్సిపాలిటీలో సీపీఐ నాలుగు, ఎదులాపురం మున్సి పాలిటీలో 3, నల్లగొండ, రామగుండం కార్పొరేషన్లు, హుజూర్‌నగర్, యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట, ఖమ్మం జిల్లా వైరా, వనపర్తి జిల్లా వనపర్తి, అమరచింత మున్సిపాలిటీల్లో ఒక్కో స్థానంలో గెలిచింది.
సీపీఎం గెలిచిన స్థానాలు
ఎదులాపురం మున్సిపాలిటీలో 2, సూ ర్యాపేట జిల్లా హుజూర్‌నగర్, యాదాద్రి జి ల్లా చౌటుప్పల్, ఖమ్మం జిల్లా వైరా, జనగామ మున్సిపాలిటీల్లో ఒక్కో స్థానంలో గెలిచింది.