12 May, 2026 | 1:24 AM

నిరుద్యోగ యువతకు అండగా ‘ఐక్యత ఫౌండేషన్’

12-05-2026 12:25 AM

ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ

తలకొండపల్లి, మే 11 (విజయక్రాంతి): నిరుద్యోగ యువత తమ లక్ష్యాలను చేరుకోవడానికి ఐక్యత ఫౌండేషన్ అందిస్తున్న ఉచిత ఎస్త్స్ర (SI) శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని ఆ ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. తలకొండపల్లి పట్టణ కేంద్రంలో గత 20 రోజులుగా కొనసాగుతున్న ఉచిత పోలీస్ శిక్షణ శిబిరంలో భాగంగా, సోమవారం అభ్యర్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నిరుద్యోగి ఉద్యోగ ప్రయత్నం వెనుక ఒక కుటుంబం కల ఉంటుందని, దానిని సాకారం చేసుకోవడానికి నిరంతర కృషి అవసరమని పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ప్రతిభ ఉన్నా, సరైన పుస్తకాలు, మెటీరియల్ లేక ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఈ పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. పోలీస్ ఉద్యోగం అనేది సమాజంలో గౌరవప్రదమైన బాధ్యత అని, అభ్యర్థులు సమయపాలన, ఆత్మవిశ్వాసంతో చదివి విజయం సాధించాలని ఆకాంక్షించారు.శిక్షణ శిబిరం ద్వారా ప్రతి ఒక్కరూ ఉద్యోగం సాధించి, శిబిర ఆశయాన్ని నెరవేర్చాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఐక్యత ఫౌండేషన్ సభ్యులు, అధ్యాపక బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.