15 June, 2026 | 2:50 PM

Breaking News

పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •  

షబ్బీర్ అలీకి షోకాజ్ నోటీసులు జారీ చేసిన ఏఐసీసీ

14-06-2026 12:58 AM

మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు.. 

కామారెడ్డి, జూన్ 13 (విజయక్రాంతి): కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి ఏఐసీసీ షో-కాజ్ నోటీ సులు జారీ చేసింది. కాంగ్రెస్ సీనియర్ నా యకుడు షబ్బీర్ అలీ మాట్లాడినట్లుగా చెబుతున్న ఓ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో అధిష్ఠానం ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది.

పార్టీ నాయకత్వంతో పాటు మహిళలను కిం చపరిచేలా ఆ సంభాషణలు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణా సంఘం ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ నియమాలు గీత దాటిన వారి కి కాంగ్రెస్ పార్టీ షో కాజ్ నోటీసులను జారీచేస్తుందని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమా ర్ తెలిపారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, షబ్బీర్ అలీ వర్గీయుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్న విషయం విదితమే.