ఏఐ నైపుణ్యం.. భవిష్యత్తు భధ్రం
- వర్క్‌ఫోర్స్ ఎడిషన్‘కు హాజరైన వెయ్యి మందికి పైగా విద్యార్ధులు
- స్టూడెంట్ ట్రైబ్ యాప్ ఆవిష్కరణ
హైదరాబాద్, ఏప్రిల్ 1౪(విజయక్రాంతి) : అత్యాధునిక సాంకేతికతలో నైపుణ్యాన్ని అందిపుచ్చుకుంటే ఆకాశమే హద్దుగా విజయాలు సాధించవచ్చునని ఈ సమావేశం స్పష్టం చేసింది.అంబేద్కర్ జయంతి సందర్భంగా, భారతదేశంలోని అతిపెద్ద జెన్ జి స్టూడెంట్ కమ్యూనిటీ (8 లక్షలకు పైగా సభ్యులున్న) ‘స్టూడెంట్ ట్రైబ్’ ఆధ్వర్యంలో ‘ట్రైబ్ మీటప్: ఏఐ వర్క్‌ఫోర్స్ ఎడిషన్’ పేరిట మంగళవారం ప్రతిష్ఠాత్మకంగా సమావేశం నిర్వహించారు.
నగరంలోని రాయదుర్గంలో ఉన్న టీఠూ జరిగిన ఈ మీటప్‌కి 1,000 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో భాగంగా, ఏఐ డేటా అనొటేషన్ ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసిన 663 మంది విద్యార్థులు సర్టిఫికెట్లు అందుకున్నారు.పాల్గొన్న ప్రతి ఒక్కరూ వారి వారి ప్రతిభా సామర్ధ్యాలను బట్టి రూ.3,500 నుంచి రూ.5,000 వరకు సంపాదించారు.ఈ కార్యక్రమానికి సారధ్యం వహించిన వ్యవస్థాపక సీఈఓ చరణ్ లక్కరాజు మీడియాతో మాట్లాడుతూ,
విద్యార్థుల సంపాదనకు సహాయపడటం ద్వారా ‘స్టూడెంట్ ట్రైబ్’కు పెరుగుతున్న ట్రాక్ రికార్డును ఈ కార్యక్రమ విజయం ప్రతిబింబిస్తుందని అన్నారు.‘ఇది అనుకరణ, శిక్షణ కాదు. ఇది నిజమైన ఆదాయంతో కూడిన నిజమైన పనిగా ఆయన పేర్కొన్నారు. భారతదేశంలోనే అతిపెద్ద ప్రోటోటైపింగ్ కేంద్రమైన తెలంగాణ ప్రభుత్వ సహకారంతో కొనసాగుతున్న టీ వర్క్స్ నిర్వహించిన ఈ సమావేశం.. విద్యార్థులు వృత్తి అవకాశాలను అందిపుచ్చుకునే విధానంలో వస్తున్న ఆధునిక మార్పుకు అద్దం పట్టిందని చరణ్ లక్కరాజు అన్నారు.
స్టూడెంట్ బ్రైట్ యాప్ ఆవిష్కరణ
ఈ సమావేశంలో ‘స్టూడెంట్ ట్రైబ్ యాప్’ అధికారికంగా ప్రారంభించారు. ఈ యాప్ ఒక ఏకీకృత వేదిక అని నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులకు మూడు కీలక రంగాలలో మద్దతు ఇవ్వడానికి ఇది రూపొందింది.ఉద్యోగాలు , ఇంటర్న్‌షిప్‌లతో పాటుగా ఎంపిక చేసిన అవకాశాలను ఇది అందిస్తుంది. అలాగే విభిన్న కార్యకలాపాలు; ఈవెంట్లు, కమ్యూనిటీలు అర్థవంతమైన సంప్రదింపులు, సంబంధాల ద్వారా నెట్‌వర్కింగ్‌కి అవకాశం ఇస్తుంది.విద్యాభ్యాసంతో పాటు గిగ్ వర్క్ చెల్లింపు ప్రాజెక్టులను ప్రారంభించడం ద్వారా సంపాదనకూ మార్గం చూపిస్తుందని చరణ్ లక్కరాజు వివరించారు.






