సాంకేతికతతో విద్యార్థులు మమేకమే ఏఐ ఫెస్ట్
యూపీఈఎస్ ప్రొఫెసర్ వైస్ చాన్సలర్ డాక్టర్ జయశంకర్ వరియార్
బంజారాహిల్స్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): సాంకేతికతతో విద్యార్థులు సరికొత్త గా మమేకమయ్యే విధానమే తమ సంస్థ రూపొందించిన ఏఐఫస్ట్ అని యూపీఈఎస్ ప్రొఫెసర్ వైస్ చాన్సలర్ డాక్టర్ జయశంకర్ వరియార్ అన్నారు. డెహ్రాడూన్‌కు చెందిన ఈ యూనివర్సిటీ ఇటీవలే తమ సంస్థగా మార్చుకుంది.
అందుకు సంబంధించిన వివరాలను సోమాజిగూడలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ జయశంకర్ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ ఆఫ్ టుమారో అనే దార్శనికతతో ఏఐను విద్యార్థుల అభ్యాస ప్రక్రియలో అంతర్భాగం చేయడం ఏఐఫస్ట్ ప్రధాన లక్ష్యమన్నారు. తద్వారా పరిశ్రమల నుంచి సహకారం పొందుతూ పరిశోధనలపై దృష్టిసారిస్తూ ఉన్నత విద్యాప్రమాణా లను సరికొత్తగా నిర్వచిస్తున్నామని వివరించారు.
ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2026 ప్రకారం జాతీయ ఉపాధి అర్హత కేవలం 56.35 శాతంగానే ఉందని గుర్తు చేశారు. సుమారు 86శాతం మంది నిపుణులు తమ కార్యాలయాల్లో ఏఐ ప్రభావం ఉంటోందని నివేదిం చారన్నారు. అకడమిక్ అంశాలకు, పరిశ్రమ అవసరాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పూరించడమే లక్ష్యంగా ఏఐఫస్ట్ నమూనా ను రూపొందించామని వెల్లడించారు. డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, గ్రాఫిక్స్, గేమింగ్ వంటి ప్రత్యేక కోర్సులను ఇందులో చేర్చడం జరిగిందన్నారు. అనంతరం యూనివర్సిటీ లోని స్కూల్ ఆఫ్ కంప్యూటర్స్ డైరెక్టర్ రాజీవ్ నంద్వాని మాట్లాడు తూ తమ విద్యా విధానానికి లభిస్తున్న ఆదరణ పట్ల హర్షం వ్యక్తం చేశారు.






