23 April, 2026 | 4:20 AM

టీఆర్పీతో కలిసి పోరాటానికి సిద్ధమైన ఎంబీటీ పార్టీ

23-04-2026 12:00 AM

బీసీ రాజ్యాధికారమే లక్ష్యంగా సంయుక్త ఉద్యమానికి శ్రీకారం

హైదరాబాద్, ఏప్రిల్ 22(విజయక్రాంతి): తెలంగాణలో బీసీలకు రాజ్యాధికారాన్ని సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ)తో కలిసి పోరాటానికి ఎంబీటీ పార్టీ సిద్ధమైంది. రాష్ట్రంలో కొనసాగుతున్న అగ్రవర్ణ రెడ్డి, రావుల ఆధిపత్య ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సంయుక్తంగా ఉద్యమం చేయాలని ఎంబీటీ పార్టీ నాయకత్వం నిర్ణయించింది.

బీసీ వర్గాల సామాజిక, రాజకీయ హక్కుల సాధన కోసం టీఆర్పీ చేపడుతున్న పోరాటానికి మద్దతుగా నిలుస్తూ, ఇకపై కలిసి ముం దుకు సాగుతామని ఎంబీటీ స్పష్టం చేసింది. బీసీలకు న్యాయం జరగాలంటే ప్రత్యామ్నా య రాజకీయ శక్తులు ఒక్కటవ్వాల్సి న అవసరం ఉందని నాయకులు అభిప్రాయపడ్డారు.

ఈ నేపథ్యంలో, టీఆర్పీ, ఎంబీటీ పార్టీల సంయుక్త పోరాటంపై అధికారిక ప్రకటనను గురువారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించే ప్రెస్ మీట్‌లో వెల్లడించనున్నారు.ఈ సమావేశం లో ఇరు పార్టీల ముఖ్య నాయకులు పాల్గొని భవిష్యత్ కార్యాచరణపై స్పష్టత ఇవ్వనున్నారు.