13 May, 2026 | 9:59 PM

Breaking News

మల్లెపల్లి వడ్ల కేంద్రంలో భారీ కుంభకోణంలో సీబీసీఐడీ విచారణ చేపట్టాలి   •   బక్రీద్ కు ప్రత్యేక చర్యలు చేపట్టాలి   •   బోధన్ పట్టణంలో గంజాయి నేరస్తుడు పట్టివేత   •   గ్రామీణ రహదారుల నిర్మాణంతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం: కూనంనేని   •   ఆత్మకూరులో ఘనంగా శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం   •   గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు   •   సుల్తానాబాద్ కోర్టుకు హాజరైన బిజెపి నాయకులు   •   భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి   •   ప్రేమ పేరుతో యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడు   •  

సంక్రాంతి నుంచి వ్యవసాయ యాంత్రీకరణ

04-01-2026 12:52 AM
  1. వ్యవసాయానికి రూ.లక్ష కోట్లు ఖర్చు 

అసెంబ్లీలో మంత్రి తుమ్మల వెల్లడి 

హైదరాబాద్, జనవరి 3 (విజయక్రాంతి): సం క్రాంతి పండుగ నుంచి వ్యవసాయ యాంత్రీకరణ ప్రారంభమవుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు.

వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ఒక్క ఏడాదిలోనే వ్యవసాయ రంగ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రూ.లక్ష కోట్ల వరకు ఖర్చు చేశారని మంత్రి పేర్కొన్నారు.  రైతు బంధు, రైతు రుణమాఫీతో పా టు వ్యవసాయ అనుబంధ పనులకు దాదాపు రూ. లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. సోయా, మక్కలను కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముం దుకు రాకపోతే ..రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసిందని మంత్రి వివరించారు.