14 April, 2026 | 1:41 AM

మిర్యాలగూడ ఆర్‌టీఏలో ఏజెంట్లదే హవా!

14-04-2026 12:00 AM
  1. స్వతహాగా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకుంటే లైసెన్స్ రానట్టే..

ఏజెంట్‌లు తోడుంటే 100 మీటర్ల డ్రైవింగ్ తోనే లైసెన్స్ జారీ 

ఆ కార్యాలయాల్లో 20 మందికి పైనే ఏజెంట్లు 

ఈ విధానం మారాలంటున్న వాహనదారులు 

మిర్యాలగూడ ఏప్రిల్ 13 : రవాణా శాఖ కార్యాలయాల్లో వాహనదారుల సేవలన్నీ ఆన్లైన్ చేసినట్లు ప్రభుత్వం చెబుతున్న... కార్యకలాపాలు మాత్రం ఏజెంట్ల ద్వారా వారి కనుసన్నలలోనే సాగుతున్నాయని వాహనదారులు చర్చించుకుంటున్నారు. నేరుగా వెళ్లే వాహనదారులు పనుల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి రావడం తీర తమ వంతు వచ్చిన కొర్రీలతో అధికారులు తిరస్కరించడం పరిపాటిగా మారిందని వాపోతు న్నారు.

దీంతో డబ్బులు పోయిన పరవాలేదు అని పని తొందరగా ముగుస్తుందని వాహనదారులు ఏజెంట్లను ఆశ్రయి స్తున్నా రు. ఫలితంగా వీరి దందా మూడు పూలు... ఆరు కాయలు అన్న చందంగా వెలుగుతుంది. ఏళ్లుగా ఆర్టిఏ కార్యాలయాలలో ఏజెంట్ల కార్యకలాపాలు జరుగుతు న్నప్పటి కీ అధికారుల తనకి సమయానికి రెండు మూడు రోజులు ఆఫీసుకు దూరంగా ఏజెంట్లు ఉంటారు.

ఆపై షరా మామూలుగానే కార్యకలాపాలు సాగిస్తుండడం పరిపాటిగా మారింది. ఈ వ్యవహారం అంతా మిర్యాలగూడ ఆర్టీఏ ఆఫీసులో జరుగుతున్నప్పటికీ పై అధికారులు మాత్రం చర్యలు తీసుకోకపోవడం పై ఆంతర్యం ఏమిటోనని వాహనదారులు గుసగుసలాడుతున్నారు.

వాహనదారులు లైసెన్సు పొందాలంటే

 ద్వి చక్ర వాహనదారుడు లైసెన్సు పొందాలంటే ఆర్టిఏ ఆఫీసు ఆవరణలో 8 ఆకారంలో డ్రైవ్ చేస్తూ కాళ్ళను నేలపై పెట్టకుండా బ్యాలెన్స్ చేయాలి. ఫోర్ వీలర్ లైసెన్సు పొందాలంటే ఆర్టిఏ ఆఫీస్ ఆవరణలో H (హెచ్ ), S (ఎస్ ) ట్రాక్లో డ్రైవ్ చేయాలి రివర్స్ చేయాలి వాహనాన్ని పార్కింగ్ చేయాలి కొన్నిచోట్ల హిల్ స్టార్ట్ కూడా ఉంటుంది దీంతోపాటు ట్రాఫిక్ సిగ్నల్స్& సైన్ బోరడ్స్ పాటించాలి. సడన్ బ్రేక్ లేదా జరుకు ఇవ్వకూడదు.

గేర్ సరిగ్గా మార్చాలి. ఇంజన్ ఆఫ్ కాకుండా డ్రైవ్ చేయాలి. ఇండికేటర్లు తప్పనిసరిగా ఉపయోగించాలి. సేఫ్ డ్రైవింగ్ చూపాలి. కానీ ఇవేవీ లేకుండా మిర్యాలగూడ ఆర్టిఏ ఆఫీసులో లైసెన్సును జారీ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

100 మీటర్ల స్టేట్ రోడ్డుతోనే లైసెన్సు జారీ 

 సాధారణంగా లైసెన్సు పొందాలంటే వాహనదారుడు రోడ్డు నియమ నిబంధనలకు అనుగుణంగా అవగాహన పొంది డ్రైవింగ్ టెస్ట్లో ప్రావీణ్యం పొందితేనే లైసెన్సును జారీ చేస్తారు . కానీ మిర్యాలగూడ ఆర్టీఏ ఆఫీసులో దీనికి విరుద్ధంగా ఏజెంట్లు పక్కనుంటే 100 మీటర్ల స్ట్రైట్ రోడ్డులో వాహనం నడిపితే రవాణా శాఖ అధికారులు లైసెన్సును ఇస్తున్నట్టు విశ్వసినీ యంగా తెలుస్తుంది. 

 రోడ్డుప్రమాదాలకు అసలు కారణం అదే.. : 

 రోడ్డు భద్రత నియమాలు తెలవని వారికి ఆర్టిఏ ఆఫీసులలో ఏజెంట్ల ను నమ్మి వారి దగ్గర డబ్బులు వసూలు చేస్తూ లైసెన్సులు జారీ చేయడంతోనే ప్రమాదాలకు ప్రధాన కారణమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వాహనదారుల లైసెన్సు జారీ విషయాలలో రోడ్డు భద్రతా నియమాలు డ్రైవింగ్ పై పూర్తి అవగాహన ఉన్నవారికి లైసెన్సులను జారీ చేయాలని ప్రజలు కోరుతున్నారు.

ఆర్టిఏ ఆఫీసులో అంతా వారిదే రాజ్యం

 వాహనదారులకు కొత్త లైసెన్సు రెన్యువల్ రిజిస్ట్రేషన్ వాహన పన్ను ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇలా ఏది కావాలన్నా వీరిని ఆశ్రయిస్తేనే త్వరగా పనులు పూర్తవుతాయని స్థానికులు చెప్పుకుంటున్నారు. ఏజెంట్ల సహకారం ఉంటే క్యూ లైన్ లో నిల్చవలసిన అవసరం లేకుండా అన్ని పనులు చక చక జరుగుతుండడంతో వాహనదారులు వీరిని ఆశ్రయిస్తున్నట్లు వినికిడి.

అధికారులు కూ డా దరఖాస్తులపై కోడ్ ఆధారంగా ఏజెంట్ల ద్వారా వచ్చిన వైతే అభ్యంతరాలు తెలపకుండా పని పూర్తి చేస్తున్నారని స్వతంత్రంగా ఆన్లైన్ చేసుకున్న వారిని పదేపదే ఆఫీసు చుట్టూ తిప్పుతున్నారనే ఆరోపణలు బలం గా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ ఏజెంట్ల దందాకు అడ్డుకట్ట వేయడంతో పాటు నిజంగా నియమ నిబంధనలకు అనుగుణంగా వా హనాలు నడిపే వారికే లైసెన్సులు మంజూ రు చేయాలని పలువురు కోరుతున్నారు.