దోస్త్‌తో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు ప్రవేశాలు
23-04-2026 01:36 AM
హైదరాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల ప్రవేశాలను దోస్త్ పరిధిలోకి తీసుకొస్తున్నారు. ఈ 2026-27 విద్యాసం వత్స రం నుంచి దీన్ని ప్రవేవపెట్టబోతున్నారు. దోస్త్ ద్వారా ప్రవేశాలను నిర్వహించనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి బుధవారం ప్రకటించింది. మరిన్ని వివరాలకు దోస్త్ అధికార వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ.వి.బాలకిష్టారెడ్డి పేర్కొన్నారు.






