సమస్యలుంటే పోస్టుకార్డు ద్వారా పంపండి
07-07-2026 12:32 AM
కలెక్టర్ హేమంత్
బిజినపల్లి జూలై 6: వట్టెంలోని జవహర్ నవోదయ విద్యాలయాన్ని సోమవారం ఆకస్మికంగా సందర్శించిన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ విద్యార్థులతో గంటన్నరపాటు ముచ్చటించారు. తరగతి గదులు, హాస్టల్, భోజనశాల, ప్రయోగశాలలను పరిశీలించిన ఆయన, సమస్యలు ఉంటే నేరుగా పోస్టుకార్డు ద్వారా తనకు తెలియజేయాలని విద్యార్థులకు సూచించారు. పేరు రాయకపోయినా సమస్యలను పరిశీలించి పరిష్కారాని కి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.






