30 June, 2026 | 4:22 AM

ఓపెన్ టెన్త్, ఇంటర్‌లో అడ్మిషన్లు

30-06-2026 12:00 AM

హైదరాబాద్, జూన్ 29 (విజయక్రాంతి): తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) టెన్త్, ఇంటర్ అడ్మిషన్ షెడ్యూల్‌ను సోమవారం విడుదల చేసింది. దరఖాస్తులను ఆగస్టు 29 వరకు స్వీకరించనున్నారు. మీసేవా, టీజీ ఆన్‌లైన్, ఏపీ ఆన్‌లైన్ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కే లింగయ్య తెలిపారు. ఫీజు చెల్లించేందుకు జూలై 28 వరకు, లేట్ ఫీజుతో ఆగస్టు 29 వరకు గడువిచ్చారు. మరిన్ని వివరాలకు డీఈవోలను సంప్రదించాలని, అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించాలన్నారు.